లండన్ : భారత దేశంలో ఆర్థిక నేరాలక పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టు బెయిల్ ను నిరాకరించింది. ఆయనను ఎనిమిది రోజుల పాటు కస్టడీకి ఆదేశిస్తూ వెస్ట్ మినిస్టర్ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగ్గొట్టి పరారీలో ఉన్న మోదీని స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. తనకు బెయిల్ మంజూరు చేయాలన్న మోదీ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ నెల 29 వరకు ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించగా, ఆయనను తమకు అప్పగించాలన్న భారత్ విజ్ఞప్తిపై కూడా అదే రోజు విచారణ జరుగనుంది.