కూలనున్న నీరవ్‌ మోదీ బంగళా

కూలనున్న నీరవ్‌ మోదీ బంగళా

ముంబయి: ఆర్థిక నేరగాడు నీరవ్‌ మోదీ మహారాష్ట్ర అలీబాగ్‌ లో రూ.నూరు కోట్ల వ్యయంతో  నిర్మించిన విలాసవంతమైన భవంతిని శుక్రవారం డైనమేట్లతో పేల్చి ,నేలమట్టం చేయనున్నట్లు గురువారం అధికార వర్గాలు ఇక్కడ తెలిపాయి.నిబంధనలకు వ్యతిరేకంగా అరేబియా  సముద్ర తీరంపైముప్పయి వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో   సువిశాల ప్రదేశంలో నీరవ్‌ మోదీ భవంతిని కట్టారు. దాని పునాదులు చాలా గట్టిగా ఉండటంతో సాధారణ పార, పలుగు వంటి సాధనాలతో కూల్చి వేత సాధ్యం కాలేదు.  అందువల్ల డైనమేట్లతో పేల్చి కూల్చివేయాలని  నిర్ణయించినట్లు  అధికార్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos