
ప్రతీ సంవత్సరం అదే ఎదురుచూపులు,అదే ఆశ చివరికి ఆశలు అడియాశలు ఇదీ
ఆస్కార్ అవార్డులపై పెట్టుకునే భారత సినీ ప్రేక్షకులు,సినీ వర్గాల పరిస్థితి.అయితే
ఈ ఏడాది ఎదురు చూపులకు,ఆశలకు ఫలితం దక్కింది.2019 ఆస్కార్ పురస్కారాల్లో భారతీయ చిత్రానికి
చోటు దక్కింది.పీరియడ్ ఎండ్ ఆఫ్ సంటెన్ష్ అనే లఘుచిత్రానికి లఘుచిత్రం విభాగంలో
ఆస్కార్ పురస్కారం లభించింది.దీంతో బాలీవుడ్ నుంచి అన్ని చిత్రపరిశ్రమలు హర్షం వ్యక్తం
చేసాయి. ఆడవాళ్ల రుతుక్రమ సమస్యలపై రూపొందిన ఈ డాక్యుమెంటరీలో సానిటరీ న్యాప్ కిన్స్ కి ఆద్యుడైన ప్యాడ్మెన్ అరుణాచలం మురుగనాధమ్ టబు నటించారు. గునీత్ మోంగా నిర్మించారు. ఒక భారతీయ లఘు చిత్రానికి ఆస్కార్ దక్కడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి కావడంతో బాలీవుడ్ వర్గాలు ఈ ఆనందక్షణాల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఈ సినిమాతో గునీత్ మోంగా ఖచ్చితంగా ఆస్కార్ పురస్కారాన్ని మన దేశానికి తీసుకొస్తారని నేహా దూపియా దియా మీర్జా గత కొన్ని రోజులుగా వాదిస్తున్నారు. ఈ రోజు వారి వాదనే నిజమై ఆస్కార్ పురస్కారం దక్కడం ఆనందాన్ని కలిగిస్తోందట. `మహిళా చిత్రాలకు మంచి రోజులొచ్చాయి. కంగ్రాట్యులేషన్స్ గునీత్. చాలా అద్భుతమైన క్షణాలివి. మా అందరికి గర్వంగా వుంది. ఈ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ లో చూడటానికి సిద్ధం కండి` అని నేహా దూపియా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఆస్కార్ అవార్డును అందుకున్న సందర్భంగా రేకా స్టేజ్‌పై ప్రసంగిస్తూ.. ‘ఓ మై గాడ్. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘మేము గెలిచాం. భూమ్మీద ఉన్న అమ్మాయిలందరు దేవతలు. ఇప్పుడు ఈ మాటని స్వర్గం కూడా వింటుంద’ని గునీత్ మోంగా ట్వీట్ చేశారు.