నేషనల్ డిఫెన్స్​ అకాడమీలో మహిళలకూ అవకాశం

నేషనల్ డిఫెన్స్​ అకాడమీలో మహిళలకూ అవకాశం

న్యూ ఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) వచ్చేనెల 5న నిర్వహించే ప్రవేశ పరీక్షను మహిళలూ రాయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఇచ్చే తుది ఆదేశాలకు అనుగుణంగానే ప్రవేశాలను నిర్వహించాల్సిందిగా ఆర్మీని ఆదేశించింది. ఎన్డీయే ప్రవేశ పరీక్షకు అమ్మాయిలనూ అనుమతించాలని కుష్ కల్రా అనే వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అర్హులైన మహిళల్ని ఎన్డీయేలో చేరనివ్వకుండా రాజ్యాంగంలోని 14, 15, 16, 19 అధికరణాలను ఉల్లంఘిస్తున్నారంటూ విమర్శించారు. బుధవారం జరిగిన విచారణలో మహిళల పట్ల ఎక్కడా వివక్ష చూపించట్లేదని కేంద్రం వాదించింది. సాయుధ దళాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది. ‘‘మీ ఆలోచనా విధానమే అసలు సమస్య. ప్రభుత్వం వెంటనే దానిని మార్చుకుంటే మంచిది. మేం ఆదేశాలిచ్చే వరకు తెచ్చుకోవద్దు’’ అని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. సైన్యంలోనూ మహిళలకు సమాన అవకాశాలను కల్పించాల్సిందేనని, ఇప్పుడున్న పరిస్థితిని వెంటనే మార్చాలని ఆదేశించింది. అవకాశాలను కల్పించాలని జస్టిస్ చంద్రచూడ్ తీర్పునిచ్చినా అమలు చేయరా? అని జస్టిస్ ఎస్కే కౌల్ ప్రశ్నించారు. ఆర్మీలో మహిళలకు అవకాశాల కోసం పర్మనెంట్ కమిషన్ వేయాలన్న జస్టిస్ ఆదేశాలను అమలు చేయరా? అంటూ నిలదీశారు. డెహ్రాడూన్ రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ లో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు ప్రవేశాలను కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ నూ సుప్రీంకోర్టు విచారించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ కాలేజీలో ప్రస్తుతం కేవలం అబ్బాయిలకే ప్రవేశాలను నిర్వహిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos