ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్కు ఆయన వర్గం నేతలు షాక్ ఇచ్చారు. నలుగురు పార్టీ నేతలు రాజీనామా చేశారు. శరద్ పవార్ వర్గంలో వారు చేరనున్నట్లు తెలుస్తున్నది. ఎన్సీపీకి చెందిన పింప్రీ-చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవాహనే, విద్యార్థి విభాగం అధ్యక్షుడు యశ్ సానే, మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ తమ రాజీనామాలను అజిత్ పవార్కు సమర్పించారు. భోసారి అసెంబ్లీ స్థానానికి టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అజిత్ గవాహనే రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ లాంగే గత రెండు దఫాలుగా భోసారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తారని తెలుస్తున్నది.