అమరావతి: వైఎస్ వివేకా
హత్య ఎవరికీ లాభిస్తుందో, వాస్తవాలన్నీ
బహిర్గతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వెల్లడించారు. శనివారం ఉదయం ఇక్కడి నుంచి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెదేపా నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు దేశానికి
ఉన్న ప్రజాదరణ చూసి వైకాపా నేతలకు కంటగింపుగా మారింద న్నారు. ఆ
అక్కసుతోనే తెదేపాపై లేని పోని నిందలు వేస్తున్నారని ఆక్రోశించారు. వివేకానంద
రెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని, ‘ఆయన హత్య వాళ్ల ఊళ్లో, వాళ్ల ఇంట్లో జరిగింది.
దీనికి తెదేపాని నిందించడం అమానుషమ’ని వ్యాఖ్యానించారు. తప్పులు చేసి
తప్పించుకోవడం జగన్‌కు అలవాటేనని విమర్శించారు. రాజకీయ లాభాల కోసమే కోడి
కత్తి కేసు తెచ్చారని, ఎన్నికల కోసమే షర్మిలతో పాత కేసులు మళ్లీ పెట్టించారని
ఆరోపించారు. నీతిమాలిన రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కార్యకర్తలను
కోరారు. తెదేపాని ఇబ్బంది పెట్టేందుకే భాజపా, వైకాపా కుట్రలు పన్నాయన్నారు.
గతంలో నిర్ణయించినట్లు శుక్రవారమే తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం- తెలుగుదేశం విజయ
శంఖారావం-పూరించనున్నట్లు తెలిపారు. శుక్రవారం శ్రీనివాసుని దర్శనం తరువాత
శ్రీకాకుళం నుంచి ప్రచారాన్ని ముమ్మరం
చేస్తామన్నారు. పార్టీ నినాదం, ఆశయం- ‘ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం’ ను తుచ
తప్పకుండా పాటించినట్లు చెప్పారు. గత ఐదేళ్లలో సాధించిన అభివృద్ధి,అమలు చేసిన
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.