పాలనంతా భూకబ్జాలు, అవినీతిమయం

పాలనంతా భూకబ్జాలు, అవినీతిమయం

అమరావతి: జగన్ పాలనంతా భూకబ్జాలు, అవినీతిమయమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. మహానాడు సందర్బంగా బుధవారం పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. ‘విశాఖలో ఆరోగ్యసేతు యాప్ తయారు చేసే వ్యక్తికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ పులివెందుల నుంచి వచ్చిన కొంతమంది దౌర్జన్యం చేసారు. అలాగే కాకినాడ మడ అడవులు, ఇంకొకవైపు ఆవ, రాజమండ్రి భూములు, గుడివాడలో ప్రైవేటు భూములు. 63 మంది కొనుక్కుంటే అవి ఇచ్చేయాలని ఓ మంత్రి బలవంతం చేసారు. ఇక వాళ్లను ఏమనాలో అర్థం కావడం లేదు. తితిదే భూముల్ని ఈ సమయంలో భూములు అమ్మడమేంటి? ఈ ప్రభుత్వం తప్పు చేసింది. కప్పి పుచ్చుకోడానికి ఎదురుదాడి చేస్తుంది. సింహాచలంలో భూముల కబ్జా చేసారు శ్రీశైలం, కనకదుర్గమ్మ గుడిలో అవినీతి జరిగింది. ఎక్కడ చూసినా అవినీతే. బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్ను అమ్మేస్తున్నారు. ఈ అరాచకమేంటి? ప్రభుత్వం ఆస్తులు అమ్మే అధికారం ఎవరిచ్చార’ని నిలదీశారు. కరోనా పై జగన్ గంభీరంగా దృనష్టి పెట్ట లేదు. కొన్ని రాష్ట్రాలు కరోనాను పూర్తిగా కట్టడి చేయగలిగాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్లయితే తప్పకుండా కరోనాను కట్టడి చేసేవాళ్లం’ అన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos