అది నా కెరియర్లోనే చెత్త పాత్ర..

  • In Film
  • November 6, 2019
  • 167 Views
అది నా కెరియర్లోనే చెత్త పాత్ర..

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.ఓ ఇంటర్‌వ్యూలో మాట్లాడిన నయనతార గతంలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గజిని’ సినిమాలో నయనతార నటించింది. ఆ పాత్రను గురించి తనకి ముందుగా చెప్పింది వేరు .. తెరపై కనిపించింది వేరు అని అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ సినిమాలో తను చేసిన పాత్ర .. తన కెరియర్లోనే చెత్త పాత్ర అని వ్యాఖ్యానించింది. తనను ఆ చిత్రంలో డమ్మీని చేశారని ఆరోపణలు చేసింది. తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడం అని సంచలన వ్యాఖ్యలు చేసింది. మురుగదాస్‌పై మళ్లీ ఆగ్రహించడానికి కారణం దర్బార్ చిత్ర పారితోషికమే కారణం అని సమాచారం. ఈ చిత్రంలో నటించినందుకు నయనతారకు పారితోషికం బాకీ ఉందట. దీంతో ఒక రోజు షూటింగ్కు కూడా రాకపోవడంతో హీరో రజనీకాంత్ కూడా ఎదురుచూడాల్సి వచ్చిందట. దర్శకుడు మురుగదాస్ కల్పించుకుని సమాధాన పరిచి నయనతారను నటింపజేసినట్లు టాక్. ‘దర్బార్’లో తన పాత్ర గురించి తనకి చెప్పిన ప్రతిదీ తెరపై కనిపించాలని ఆమె ముందుగానే మురుగదాస్ కి చెప్పిందట. ఆయన ఓకేనన్న తరువాతనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos