హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ సంచలనాలకు ప్రతీక . ఇటీవల బ్యూటిఫుల్ చిత్రం ప్రీరిలీజ్లో కథానాయిక నైనాతో అడుగులు కలిపిన ఆయన తాజాగా ఆమె కాళ్లు పట్టుకుని మరోసారి వార్తల్లో కెక్కారు. బ్యూటిఫుల్ను ట్రిబ్యూట్ టు రంగీలా అనే ఉపశీర్షికతో విడుదల చేయనున్నారు. అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నైనా గంగూలీ, సూరి ప్రధాన పాత్ర ధారులు. ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం ఆదివారం సాయంత్రం ప్రీ న్యూ ఇయర్ ప్రైవేటు పార్టీని ఇక్కడ నిర్వహించింది. ‘రా కసితీరా’ అనే పాటకు హీరోయిన్ నైనాతో కలిసి ఆర్జీవీ డ్యాన్స్ చేశారు.అందులో భాగంగా ఆయన హీరోయిన్ నైనా కాళ్ల పై పడ్డారు. దీంతో షాక్‌కు గురైన నైనా ఒక్కసారిగా కింద కూలబడ్డారు. భావోద్వేగానికి గురై ఆర్జీవీని పట్టుకుని కన్నీరు కార్చారు.