ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ ణవీస్ రాజీనామా చేయకుంటే శాసన సభ విశ్వాస పరీక్షలో ఆయన్ను ఓడిస్తామని ఎన్సీపీ సీనియర్ నాయకుడు నవాబ్ మాలిక్ సోమవారం ఇక్కడ వ్యాఖ్యా నిం చారు. ‘దేవేంద్ర ఫడణవీస్ శాసన సభలో తనకు మెజారిటీ లేదనే విషయం తెలుసుకోవాలి, అతను తప్పు చేసిన విషయం తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుంటే మేం ప్రభుత్వాన్ని సభలో జరిగే విశ్వాస పరీక్షలో ఆయన్ను ఓడిస్తామ’ని నవాబ్ మాలిక్ చెప్పారు. ‘మా సంకీర్ణ కూటమికి 165 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు. అజిత్ పవార్ తప్పు చేశారు, ఆయన రాజీనామా చేయాల’న్నారు. అత్యున్నత న్యాయస్థానం వాస్తవాలను గుర్తించి సరైన తీర్పు వెలువరిస్తుందని ఆశించారు.