న్యూయార్క్: అమెరికా శ్వేతసౌధం వాణిజ్య సలహాదారుడు పీటర్ నవర్రో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇండియా దిగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్న అంశంపై మాట్లాడుతూ బ్రహ్మణులు లాభపడుతున్నట్లు న పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజలను వాడుకుని బ్రహ్మణులు లాభపడుతున్నారని, దీన్ని ఆపాలని అన్నారు. రష్యాకు లాండ్రీగా ఇండియా మారినట్లు ఆరోపించారు. అమెరికాకు పోటీగా వాణిజ్య అసమానతలను ఇండియా సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్లే ఇండియాపై 50 శాతం టారీఫ్ వసూల్ చేస్తున్నట్లు నవర్రో పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రాఫిటీరింగ్ బ్రహ్మిన్స్ అనే పదాన్ని వాడడం చర్చనీయాంశమైంది. ఆ పదం వాడుకపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.