నటుడు నవదీప్‌కు ఈడీ తాఖీదు

నటుడు నవదీప్‌కు ఈడీ తాఖీదు

హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది. ఈ నెల 10న హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. నార్కోటిక్ బ్యూరో కేసు ఆధారంగా ఈ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తున్నది. సెప్టెంబర్ 14న టీఎస్ న్యాబ్ అధికారులు బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లు, ఓ దర్శకుడితోపాటు నలుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా నిందుతులతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్టయినవారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నారని, తమవద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos