హైదరాబాదు : పవన్ కల్యాణ్, నటుడు పోసాని వివాదంపై సినీ నిర్మాత నట్టి కుమార్ సక్తికర వ్యాఖ్యలు చేశారు. పోసాని ఇంటిపై పవన్ కల్యాణ్ అభిమానులు దాడి చేయడాన్ని ఖండించారు. నాయకులకు మంచి పేరు తెచ్చేలా అభిమానులు ప్రవర్తించాలని హితవు పలికారు. ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ టికెట్ పోర్టల్స్ ప్రేక్షకుల నుంచి ఎక్కువ ధర వసూలు చేస్తున్నా ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొందరు నిర్మాతలు పవన్ కల్యాణ్ కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. వపన్ పెద్ద స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. సినీ పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ నుంచి వెళ్లిన లేఖపై ఎవరితో చర్చించలేదని, కేవలం ప్రెసిడెంట్, కార్యదర్శి మాత్రమే లేఖను పంపించారని పేర్కొన్నారు. ఏ సమావేశం జరిగినా కేవలం ఆరుగురు నిర్మాతలు మాత్రమే వెళ్తున్నారు చిన్న నిర్మాతలను సమావేశాలకు ఎందుకు పిలవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ అందరినీ సమానంగా చూస్తారని చెప్పారు.