భోపాల్ : తిరుగు బాటు నేత సింధియాను శాంతింప చేసేందుకు ముఖ్య మంత్రి కమలనాథ్ కసరత్తు ఆరంభించారు. అసంతృప్తి పరులకు పదవుల పందారాన్ని చేపట్టనున్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు జరిగిన మంత్రి వర్గ సమావేశం తాజా పరిణామాలపై చర్చించింది. హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. బెంగళూరు విలాస విడి దిలోని సింధియా వర్గం తిరిగి వస్తారని కమల్నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలు న్నాయని అనుకుంటున్నారు. సింధియా భాజపాలో చేరతారని, ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలున్నాయి.