విశ్వం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునే పనిలో….

విశ్వం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునే పనిలో….

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. గయానా నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా నింగిలోకి అతిపెద్ద వెబ్ స్పేస్ టెలీస్కోప్‌ను విజయవంతంగా నాసా సైంటిస్టులు ప్రవేశపెట్టారు. దీని ద్వారా విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలపై వెబ్ స్పేస్ టెలీస్కోప్ పరిశోధనలు జరపనుంది. ఓ రకంగా ఇది గత కాలానికి చెందిన ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్‌ లాంటిది. 21 అడుగుల పొడవైన వెబ్ స్పేస్ టెలీస్కోప్‌ కోసం నాసా సైంటిస్టులు రూ.75వేల కోట్ల ఖర్చు పెట్టారు.
ఈ టెలీస్కోప్ 13.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డ గెలాక్సీకి చెందిన గుట్టు విప్పనుంది. ఈ టెలీస్కోప్ ద్వారా విశ్వంలోని నక్షత్రాలు, పాలపుంతలను సైంటిస్టులు పరిశోధించనున్నారు. అపోలో అంతరిక్ష ప్రయోగ రూపకల్పనలో పాలు పంచుకున్న జేమ్స్ ఇ.వెబ్ పేరునే సైంటిస్టులు ఈ టెలీస్కోపునకు పెట్టారు. హబుల్ టెలీస్కోప్ వారసత్వాన్ని కొనసాగించటానికి రంగంలోకి దిగుతున్న దీనికి షార్ట్ ఫామ్లో ‘వెబ్’ అని పిలుచుకుంటున్నారు. హబుల్ టెలీస్కోప్ కంటే వెబ్‌స్పేస్‌ టెలీస్కోప్ రెండున్నర రెట్లు పెద్దది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ అకాడమీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. కంటికి కనిపించే నక్షత్రాలను వెయ్యి కోట్ల రెట్ల స్పష్టతతో వెబ్ స్పేస్ చూపించనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos