శివాజీరాజాతో శతృత్వం లేదు..

  • In Film
  • March 11, 2019
  • 168 Views
శివాజీరాజాతో శతృత్వం లేదు..

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌ సంఘానికి జరిగిన ఎన్నికల్లో శివాజీరాజాపై విజయం సాధించిన సీనియర్‌ నటుడు నరేశ్‌ సోమవారం మా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నరేష్‌ ఉద్వేగభరితంగా ప్రసగించాడు.మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజాతో తనకు ఎటువంటి శతృత్వం లేదని శివాజీరాజా తమకు చిరకాల మిత్రుడని శివాజీరాజాను క్షమిస్తున్నామన్నారు.మా ఎన్నికల్లో ఓడినా శివాజీరాజాను మా తో కలసి పని చేసేందుకు ఆహ్వానిస్తున్నామన్నారు.మా ఎన్నికల సందర్భంగా కొంమంతి చేసిన వ్యాఖ్యలు తమపై చేసిన ఆరోపణలు,విమర్శలు చాలా బాధించాయన్నారు.వాటన్నింటిని మరచిపోయి తమపై విమర్శలు,ఆరోపణలు చేసిన వ్యక్తులను కూడా క్షమించి వారితో కలసి పని చేస్తూ ఆర్టిస్టుల సంక్షేమం కోసం పాటు పడతామన్నారు.ఇక మా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండా నెరవేరుస్తామని నరేశ్‌ స్పష్టం చేశారు.మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) రసవత్తర పోరులో సీనియర్ నరేష్ గెలుపొందిన సంగతి తెలిసిందే. నేటి నుంచి మా కొత్త మెగాస్టార్ చిరంజీవి గారు – నాగార్జున సహా అందరూ మాకు అండగా నిలిచారన్నారు. మెగాబ్రదర్‌ నాగబాబు మీ ప్యానల్ బావుందని మీరు తప్పకుండా గెలుస్తారంటూ తమతో నేరుగా చెప్పారన్నారు. మా ముగ్గురిపై (నరేష్-జీవిత-రాజశేఖర్) నమ్మకం ఉంచి గెలిపించిన అందరికీ ధన్యవాదములు అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos