హైదరా బాదు : మొసలి కన్నీరు కార్చుతూ ప్రజలను బీజేపీ నేతలు మోసం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శిం చారు. ‘అంబర్పేటకు వస్తే చాలా రోజుల అనంతరం బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు రోజుల కిందట భావోద్వేగానికి గురవటంపై ఈ మేరకు స్పందించారు. ‘జన ఆశీర్వాద యాత్ర అంటూ కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలు చెబుతున్నారు. పార్ల మెంటులో ప్రధాని మోదీ అసత్యాలు చెబుతుంటే, బయట కేంద్ర మంత్రు లూ అదే తీరులో మాట్లాడు తున్నారు. తాలిబన్లు ఎంత ప్రమాదకరమో, పెగాసస్ కూడా అంతే ప్రమాదకరంర. పెగాసస్ కు సంబంధించిన విషయాలను చెప్పడానికి మోదీ భయపడుతురు. కేంద్ర ప్రభుత్వం కొత్త సాగు చట్టాల వల్ల రైతులకు నష్టదాయకమ’ని మండి పడ్డారు.