మాజీ మంత్రి పి.నారాయణ ఆస్తులపై సిఐడి దాడులు

మాజీ మంత్రి పి.నారాయణ  ఆస్తులపై సిఐడి దాడులు

అమరావతి : మాజీ మంత్రి పి.నారాయణ ఇంటిపై ఎపి సిఐడి అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడలో నారాయణకు సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్ల్లు-మొత్తం 10 చోట్ల తనిఖీలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు మంగళవారం తాఖీదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిలోని దళితులకు చెందిన అసైన్డ్ భూములు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈ నెల 23న విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos