కాంగ్రెస్‌కు కావాలి కాంట్రాక్టు ప్రధాని:నక్వి

న్యూఢిల్లీ: ‘కాంట్రాక్ట్, రిమోట్ కంట్రోల్ ప్రధాని’ దేశాన్ని పాలించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ జరిగిన మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రజలు సమర్థుడైన ప్రధాని దేశాన్ని పాలించాలని కోరుకుంటే, కాంగ్రెస్ మాత్రం కాంట్రాక్ట్ ప్రధాని కావాలనుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానిని ఆరు నెలలకోసారి మారుస్తుందని చెప్పారు. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారన్ని రాజకీయ విహార యాత్రగా అభివర్ణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos