గ్యాంగ్ లీడర్‌ టైటిల్‌పై ముదురుతున్న రగడ…

  • In Film
  • March 9, 2019
  • 186 Views
గ్యాంగ్ లీడర్‌ టైటిల్‌పై ముదురుతున్న రగడ…

మెగాస్టార్‌ చిరంజీవిని మాస్‌ హీరోగా మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రం గ్యాంగ్‌లీడర్‌.అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన సంచనలం అంతా ఇంతా కాదు.ఈ చిత్రం పాటు ఇప్పటకీ ఏదోఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.అంతలా అప్పటితరం యువతను ఊపేసింది గ్యాంగ్‌లీడర్‌.అటువంటి చిత్రం టైటిల్‌ ప్రస్తుతం విదాదాల్లో చిక్కుకుంది.నేచురల్‌స్టార్‌ నాని హీరోగా, మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి కూడా గ్యాంగ్‌లీడర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.అయితే నిర్మాత,హీరో మోహన్‌ కృష్ణ గ్యాంగ్‌లీడర్‌ను తాము ఇదివరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని త్వరలోనే మాణిక్యం మూవీస్‌ బ్యానర్‌లో గ్యాంగ్‌లీడర్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని ప్రతికాముఖంగా వెల్లడించారు.గత ఏడాది అక్టోబర్‌లోనే గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని ఇప్పటికే కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేశామని మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌22వ తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మైత్రి మూవీస్‌ నుంచి తమకు ఫోన్‌ వచ్చిందని గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌ ఇవ్వాలంటూ కోరారన్నారు.అయితే అందుకు తాము నిరాకరించామని అయినప్పటికీ నాని పుట్టినరోజున మా టైటిల్‌తో చిత్రాన్ని ప్రకటించారని మా అనుమతి తీసుకోకుండా ఎలా ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై ఛాంబర్‌లో ఫిర్యాదు చేశామన్నారు.రూ.3కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తున్నామని గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌ పెట్టడం వల్ల చాలా పెద్దమొత్తంలో ఫండింగ్‌ వచ్చిందని కొంతభాగం చిత్రీకరించామని ఇటువంటి సమయంలో మా టైటిల్‌ తీసుకోవడం సమంజసం కాదన్నారు.ఒకవేళ టైటిల్‌ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తే కేవలం మెగా హీరోల సినిమాల కోసం మాత్రమే ఇస్తామని మరే హీరోకు కూడా ఇచ్చే ప్రసక్తి లేదని దీనిపై లీగల్‌గా కూడా పోరాడతామంటూ తేల్చి చెప్పాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos