కరాచీ బేకరీ ఇకపై ఇండియన్‌ బేకరీ..

పుల్వామాలో భారతసైనికులపై ఉగ్రవాదుల దాడి అనంతరం భారతదేశంలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తరకంగా మారాయి.జవాన్లపై ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్థాన్‌ పేరు మాత్రమే కాదు పాకిస్థాన్‌ దేశానికి సంబంధించి పేర్లు,వ్యక్తులపై కూడా భారతీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.చివరకు కశ్మీరీలపై కూడా దాడులకు పాల్పడుతుండడం భారతీయుల్లో ఎంత అసహనం రగిలిందో తెలియజేస్తోంది. ఈ కోవలోనే హైదరాబాద్‌ నగరం ప్రధాన కేంద్రంగా దేశం మొత్తం విస్తరించిన కరాచీ బేకరీలపై కూడా భారతీయుల ఆగ్రహజ్వాలు ఎగిసిపడ్డాయి.కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ హిందుత్వ సంఘాలు,ప్రజలు కూడా బేకరీ యజమాన్యాన్ని బెదిరించడంతో పాటు బేకరీల ఎదుట నిరసనలు, ఆందోళనలు చేసారు.దీంతో పేరు మాత్రమే కరాచీ బేకరి అని ఇది పూర్తిగా భారతీయ సంస్థని యజమాన్యం ఎంత నచ్చజెప్పినా భారతీయులు శాంతించలేదు.దీంతో చేసేదేమి లేక బేకరీ యజమాన్యం సంస్థ పేరును కరాచీ బేకరీ నుంచి ఇండియన్‌ బేకరీగా నామకరణం చేయడానికి నిర్ణయించుకుంది.హైదరాబాద్ లోని మొజంజాహీ మార్కెట్ లో ఉన్న కరాచీ బేకరీ యాజమానాన్ని తాజాగా కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలోని బీజేపీ నేతలు సంప్రదించగా ఈ మేరకు హామీ ఇచ్చింది. రెండు రోజుల్లో ఇండియన్ కరాచీ బేకరీ పేర్లు పెడుతామని యాజమాన్యం తెలిపినట్లు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసయాదవ్ ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos