చండీగఢ్: హరియాణా ఉపముఖ్యమంత్రి పదవి జన్నాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా తల్లి నైనా చౌతాలాకు దక్కనుంది. జేజేపీ పార్టీ శాసన సభ్యులు శనివారం సాయంత్ర ఇక్కడ భేటీ అయి శాసన సభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ భేటీలోనే ఉపముఖ్యమంత్రి పేరును ఖరారు చేయనున్నారు. నైనా చౌతాల బాధ్రా విధానసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. గతంలో ఐఎన్ఎల్డీ నుంచి కూడా ఆమె శాసన సభకు ఎన్ని కయ్యారు. హరియాణాలో 40 సీట్లు గెల్చుకున్న భాజపా, జేజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. జేజేపీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. దుష్యంత్ చౌతాలా ఉపముఖ్యమంత్రి పదవి చేపడతారని వార్తలు వచ్చాయి.