ముంబై: మాజీ నటి, కాంగ్రెస్ పార్టీ సభ్యులు నగ్మ తాజాగా భాజపా కు చెందిన మాజీ నటి నటి జయప్రదను టార్గెట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి మాదకద్రవ్యాలు, బాలీవుడ్లో డ్రగ్ కల్చర్ అంశాలను తెర మీదకు తెచ్చారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సీబీఐ, ఎన్సీబీ,ఈడీ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో భాజపా సభ్యులు జయప్రద గారికి తెలపండి. సుశాంత్ చనిపోయి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దేశ ప్రజలంతా సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఫలితం లేదు. దీన్ని కవర్ చేయడానికి ఉన్నట్లుండి భాజపా బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి మాట్లాడుతోంది. ఇప్పటికి కూడా దేశ ప్రజలు సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని భావిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. భాజపా లోక్సభ సభ్యుడు నటుడు రవికిషన్ బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం ఉందని చేసిన ప్రకటనకు జయప్రద మద్దతిచ్చారు. దాంతో నగ్మ ఈ మేరకు స్పందించారు.