బిగ్‌బాస్‌ 3 హోస్ట్‌గా కింగ్‌..

  • In Film
  • March 19, 2019
  • 164 Views
బిగ్‌బాస్‌ 3 హోస్ట్‌గా కింగ్‌..

ఎన్నో అనుమానాల,అంచనాల
మధ్య 2017లో తెలుగులోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయడంతో సూపర్‌
సక్సెస్‌ అయ్యింది.అయితే అరవింద సమేత చిత్రం కారణంగా రెండవ సీజన్‌ చేయడానికి ఎన్టీఆర్‌
అంగీకరించకపోవడంతో నేచురలస్టార్‌ నానిని హోస్ట్‌గా తీసుకున్నారు.ఎన్టీఆర్‌ రేంజ్‌లో
కాకపోయినా నాని కూడా బిగ్‌బాస్‌ను బాగానే నడిపించాడు.అయితే రెండవ సీజన్‌ కంటెస్టంట్ల
చిల్లర వేషాలు,కౌశల్‌ ఆర్మీ రచ్చతో నాని కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్‌కు
గురయ్యాడు.దెబ్బతో బిగ్‌బాస్‌కు టాటా చెప్పేసి సినిమాలపై దృష్టి పెట్టాడు.దీంతో మరోసారి
ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకురావడానికి స్టార్‌ మా గట్టిగానే ప్రయత్నించినా ఎన్టీఆర్‌
ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి కమిట్‌ అవడంతో ఎన్టీఆర్‌పై ఆశలు వదులుకుంది.వెంకటేశ్‌ను ప్రయత్నించినా
నేను చేయనంటూ కుండబద్దలు కొట్టేయడంతో చిట్టచివరి ప్రయత్నంగా నాగార్జున వద్ద నిలిచినట్లు
తెలుస్తోంది.మీలో ఎవరు కోటీశ్వరుడు షోను ఆసక్తికరంగా నడిపించిన నాగార్జున అయితే బిగ్‌బాస్‌కు
సరిగ్గా సరిపోతాడని భావించి స్టార్‌ మా నాగార్జునను సంప్రదించారట.మా ఛానెల్‌తో గత అనుబంధాన్ని
గుర్తు చేసుకున్న నాగార్జున కూడా బిగ్‌బాస్‌ హోస్ట్‌ చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.దీంతో
బిగ్‌బాస్‌ నిర్వాహకులు మూడవ సీజన్‌ ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos