టాలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం రేగింది. నిర్మాత సురేశ్ బాబు, హీరో వెంకటేశ్, యువ కథానాయకుడు నానిలకు చెందిన కార్యాలయాలు,ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించినట్టు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. హీరో నాగార్జున ఇళ్లు,కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు జరిగినట్టు ప్రచారం జరిగింది. దీనిపై నాగార్జున స్పందించారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మీ ఇంటిపై దాడి చేశారట కదా అని తనకు ఫోన్లు వస్తున్నాయని, తన స్నేహితులు కూడా అడుగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఆఫీసు, ఇంటిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులెవరూ దాడులు నిర్వహించలేదని నాగ్ స్పష్టం చేశారు. తన విషయం తనకే ఓ వార్తలా అనిపిస్తోందని విస్మయం వ్యక్తం చేశారు.