రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న నాగార్జున

  • In Film
  • February 17, 2022
  • 149 Views
రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న నాగార్జున

హైదరాబాద్: తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గురువారం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తన భార్య అక్కినేని అమల, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి వెళ్లి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో నాగార్జున అడవిని దత్తత తీసుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నాగార్జున అడవిని దత్తత తీసుకున్నారు. నాగార్జున కుమారుడు నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos