మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడని వాఖ్యలు చేసిన మెగాబ్రదర్ నాగబాబు మరోసారి ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సత్యం వద ధర్మం చర.. అంటే (speak the truth.. live the righteous life) నిజం మాట్లాడాలి, న్యాయంగా జీవించాలి అని అర్థం. కానీ, ఎవరో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వ్యంగ్యంగా అన్న మాట.. సత్యం వధించబడింది.. ధర్మం చెరసాల పాలైనది అన్నారు. వ్యంగ్యంగా అన్నా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది‘ అని నాగబాబు ట్వీట్ చేశారు. తను ఇటీవల చేసిన ట్వీట్ను దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.గాడ్సేపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం కావడంతో నాగబాబు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే..
సత్యం వద ధర్మం చర..అంటే (speak the truth,,live the righteous life)నిజం మాట్లాడాలి,,న్యాయం గా జీవించాలి అని అర్థం.కానీ ఎవరో ప్రస్తుత పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని వ్యంగ్యంగా అన్న మాట,,,సత్యం వధించబడింది,,ధర్మం చెరసాల పాలైనది అన్నారు.వ్యంగంగా అన్నా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది…..
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 22, 2020