నాగ సాధువులకు కరోనా కాటు

నాగ సాధువులకు కరోనా కాటు

హరిద్వార్ : ఇక్కడ జరుగుతున్న కుంభమేళాపై కరోనా పంజా విసిరింది. దాదాపు అన్ని అఖాడాలోని సాధువులూ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. తాజాగా మరో 30 మంది నాగ సాధువులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దరిమిలా ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం సాయంత్రానికి కుంభ మేళాను శుక్రవారంతో సమాప్తం చేయదలచారు. దీనికి అఖాడీ సాధువుల అమోదం కూడా అవసరం. ఈ నెల 1 నుంచి 30 వరకూ పవిత్ర కుంభమేళా జరగాల్సి ఉంది. నిరంజిని అఖాడా సాధవులు కుంభమేళా నుంచి నిష్క్రమించేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. కరోనా ఉధృతి కొనసాగుతున్నంవదున తమ కుంభమేళాను ముగిస్తు న్నామని పేర్కొన్నారు. తమ రాజస్నానం పూర్తైందని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి పేర్కొన్నారు. తమ అఖాడాలోనూ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నందున హరిద్వార్ను వీడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 30 మంది సాధువులు కరోనా బారిన పడ్డారని, నిరంజని, జూనా సహా దాదాపు అన్ని అఖాడాలోని సాధువులు వైరస్ బారి న పడ్డారని, మిగితా వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని హరిద్వార్ ప్రధాన వైద్యాధికారి అధికారి ఎస్కే ఝా పేర్కొన్నారు. కరోనా సోకిన వారందరినీ హోం క్వా రం టైన్లో ఉండాలని తాము సూచించినట్లు తెలిపారు. కొందర్ని ఆస్పత్రిలో కూడా చేర్పించామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos