
అమరావతి: సినీ నటుడు నాగబాబు జనసేన పార్టీలో చేరనున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకో నున్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ అదే జిల్లా భీమవరం విధానసభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.