కోల్కతా : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన వాహన శ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. ఇక్కడి డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలే దాడికి దిగి నట్లు ఆరోపించారు. అధికార తృణమూల్ నేతలు నడ్డా వాహన శ్రేణిని ఆపడానికి ప్రయత్నించారని, ఆపకపోవడంతో రాళ్లదాడికి దిగారని వివరిం చారు.