అశ్విన్‌కు మురళీ సమర్థన

  • In Sports
  • March 26, 2019
  • 197 Views

మురళీ కార్తీక్‌

.జైపూర్‌ : రాయల్‌ ఛాలెంజర్స్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ను కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ రనవుట్‌ చేసిన తీరు విమర్శల పాలవుతుండగా, మాజీ స్పిన్నర్‌ మురళీ కార్తీక్‌ మాత్రం అతనిని వెనకేసుకొచ్చాడు. అశ్విన్‌ నిబంధనలకు లోబడే బట్లర్‌ను ఔట్‌ చేసినప్పుడు, దీనిపై రాద్ధాంతం అనవసరమని పేర్కొన్నాడు. క్రీడా స్ఫూర్తి పేరిట నిబంధనలను కాదనలేము కదా అని అన్నాడు. బట్లర్‌ను ఓ సారి హెచ్చరించకుండానే ఔట్‌ చేయడం సమర్థనీయం కాదని ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్‌సన్‌ ట్వీట్‌ చేయగా, ఐసీసీ నిబంధనలు మీ దేశంలోనే ఉన్నాయి. వెళ్లి మార్పులు చేసుకోండి…అంటూ సుతిమెత్తగా సమాధానమిచ్చాడు. దీనిని సమర్థించడం మంచిది కాదని ఓ అభిమాని ట్వీట్‌ చేయగా, బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటి వెళ్లకూడదని, ఎవరైనా నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని పేర్కొన్నాడు. కార్తీక్‌ 2012,  2013లలో ప్రత్యర్థులను ఔట్‌ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos