న్యూ ఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి బుధవారం మరింత విషమించింది. మంగళవారం నుంచి ఆయనకు మూత్ర పిండాల సమస్యలూ తలెత్తాయి. ఇప్పటికీ కోమాలోనే ఉన్నారు. వెంటిలేటర్ సాయంతోనే చికిత్స అందిస్తున్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆపరేషన్ కూడా చేసారు. అప్పుడే ఆయనకు కరోనా సోకినట్టు తేలిందని పదాతిదళ ఆస్పత్రి బుధవారం మధ్యాహ్నం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.