శ్రీనగర్: ప్రధాని నరేంద్ర
మోదీ చేసిన ‘న్యూ క్లియర్ మీట’ వ్యాఖ్యలకు జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా
ముఫ్తీ ఎద్దేవా చేసారు. భారత్ వద్ద ఉన్న న్యూక్లియర్ ఆయుధాలు ‘దీపావళి’ కోసం
దాచుకోనప్పుడు పాకిస్థాన్ కూడా ‘ఈద్’ వరకూ దాచుకోదని మెహబూబా వ్యాఖ్యానించారు.
రాజకీయ ప్రసంగాల్లో ఇంత దిగజారుడు తనం అవసరం లేదని మోదీకి చురకలు వేశారు.పాకిస్థాన్
తరచు న్యూక్లియర్ బెదరింపులకు దిగుతోందని, అలా దాడి చేసే పరిస్థితి వస్తే తాము
మాత్రం చూస్తూ ఊరుకుంటామా అని ఆదివారం రాజస్థాన్, బార్మర్‌ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘పాకిస్తాన్
బెదిరింపులకు భయపడి పోయే విధానాలను ఇప్పుడు భారత్ పక్కన పెట్టింది. మా దగ్గర
న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని పాకిస్తాన్ ప్రతీ రోజూ బెదిరిస్తూనే ఉంది. మీ దగ్గర
న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే, ఇండియా వద్ద
ఉన్న న్యూక్లియర్ ఆయుధాల్ని దీపావళి కోసం దాచుకుంటామా? అని మోదీ ఎదురు ప్రశ్న వేసారు.