కాకినాడ: కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం ఇక్కడ ప్రకటించారు. ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా పలు విమర్శలు చేస్తున్నారని ఆక్రోశించారు. తనను కుల ద్రోహి, గజదొంగ వంటి వ్యాఖ్యలతో దుయ్యబట్టారని వాపోయారు. ‘కాపు ఉద్యమం ద్వారా నేను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయా. మేధావులతో కలిసి ఉద్యమం నడిపా. నేను రోజుకో మాట మాట్లాడుతున్నానని ఆరోపించారు. ఇప్పుడు బంతిని కేంద్రం కోర్టులో వేసాననడం బాధ కలుగుతోంది. సందర్భానుసారంగా ఉద్యమం రూపురేఖలు మార్చుకుంటోంది. నా జాతికి ఏదో విధంగా మేలు జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశాన’ని బహిరంగ లేఖలో విపులీకరించారు.