కరిగిన కల

కరిగిన కల

కియోవ్: రష్యా దాడిలో ఉక్రెయిన్లో ని ప్రపంచ అతిపెద్ద విమానం- మ్రియా, ఏఎన్225 ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డిమిట్రో కులేబా ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్పోర్ట్లో విమానాన్నినిలిపి ఉన్నపుడు రష్యా క్షిపణి దీన్ని కొంత మేర ధ్వంసమైంది. విమానం ఎంత వరకు ధ్వంసమైందో ఇప్పుడే చెప్పలేము, సాంకేతిక బృందం విమానాన్ని పరిశీలిస్తోందని ఆ తర్వాతే ఈ నష్టంపై అంచనా వేయగలమని వివరించారు. మ్రియా అంటే ఉక్రెయిన్ భాషలో కల అని అర్థం. ఇది ఆరు ఇంజిన్లు కలిగిన సరకు రవాణా విమానం. ఉక్రెయిన్కు చెందిన ఆంటోనోవ్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. రష్యన్లు తమ కల (విమానం)ను ధ్వంసం చేయగలరేమో కానీ, స్వేచ్ఛగా, మరింత బలంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదగాలనుకునే తమ దేశపు కలను ధ్వంసం చేయలేరని డిమిట్రో తన ట్వీట్లో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos