మద్యం తాగడం ప్రజలకు హక్కు..

మద్యం తాగడం ప్రజలకు హక్కు..

మద్యపాన నిషేధం అంశంపై మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కమలనాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుబంధ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి కాంట్రాక్టర్లకు అనుమతులిచ్చింది.ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ లిక్కర్ మాఫియాకు సీఎం న్యూ ఇయర్ కానుక ఇచ్చారని మధ్యప్రదేశ్‌ను మదిరప్రదేశ్(మద్య ప్రదేశ్)గా మారుస్తున్నారని మండిపడ్డారు.దీంతో అక్రమ మద్యపానాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర మంత్రి గోవింద్‌ సింగ్‌ శివరాజ్‌కు బదులిచ్చారు. మద్య నిషేధంపై అంత ఆందోళన ఉంటే.. మీ హయాంలో ఎందుకు ఆ పనిచేయలేదని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం కుదరదని చెప్పిన ఆయన.. దాన్ని సమర్థించేందుకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమకు నచ్చిన తిండి తినేందుకు,తాగేందుకు హక్కు ఉంటుందని చెప్పారు. మద్యం తాగాలని ఎవరూ ఎవర్నీ బలవంతం చేయట్లేదని.. కావాల్సినవాళ్లు షాప్‌కి వెళ్లి స్వయంగా తెచ్చుకుంటున్నారని చెప్పారు. కాబట్టి మద్యంపై నిషేధం విధించడం కుదరదన్నారు. అంతేకాదు, వైద్య చికిత్స తీసుకునేటప్పుడు కొంతమంది పేషెంట్లకు మద్యం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. తన మిత్రుడు ఒకరు ప్రతీ రోజూ రాత్రి ఒక పెగ్గు తీసుకుంటాడని, లేదంటే ఆరోజు రాత్రి అతనికి నిద్ర పట్టదని చెప్పారు. ఆ ఒక్క పెగ్గు వల్ల రాత్రిపూట మంచి నిద్ర పట్టడంతో పాటు ఉదయం కూడా యాక్టివ్‌గా ఉంటారని అన్నారు.కొంతమంది పేషెంట్లకు వైద్యులే సలహా ఇస్తుంటారని, తక్కువ మొత్తంలో రోజూ ఒక పెగ్గు తీసుకోవాలని చెబుతుంటారని గోవింద్ సింగ్ అన్నారు. వ్యక్తుల ఆహారపు అలవాట్లు,డ్రింకింగ్ అలవాట్లపై తామెలాంటి నిషేధాలు పెట్టదలుచుకోలేదని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos