మధ్య ప్రదేశ్ ‘మార్గం’ దేశానికి ఆదర్శ ప్రాయం

మధ్య ప్రదేశ్ ‘మార్గం’ దేశానికి ఆదర్శ ప్రాయం

ముంబై: కరోనా సమయంలో మధ్యప్రదేశ్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకే ఆదర్వప్రాయమని శివసేన అధికార పత్రిక- సామ్నా పిలుపునిచ్చింది. ‘కరోనాతో దేశం వెనకబడుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.5 వేల పింఛన్ అందిస్తామని ప్రకటించడంపై అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇది మానవత్వంలో గొప్ప అడుగు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దేశానికి ఒక సందేశం అందిస్తున్నారు’ అని సంపాదకీయంలో పేర్కొంది. అనాథ చిన్నారుల విషయంలో దేశానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక మార్గాన్ని చూపింది. దీని అమలుకు మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సమాఖ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా’ ప్రాజెక్ట్ను వ్యతిరేకించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రూ.25,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అవనసరమని కుండ బద్ధలు కొట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos