వైకాపాలోకి మరో టీడీపీ ఎంపీ

వైకాపాలోకి మరో టీడీపీ ఎంపీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీకి షాక్‌ మీద షాక్‌. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు తాజాగా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి సోమవారం ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఇటీవలే పార్టీలో చేరిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌తో కలసి లోటస్‌పాండ్‌లో ఆయన జగన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే మేలు జరుగుతోందన్నారు. తెదేపా తిరిగి ఎంపీ టిక్కెట్‌ కేటాయించడం లేదని తెలిసే తాను వైఎస్సార్‌సీపీలో చేరుతున్నాననేది పచ్చి అబద్ధమని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos