చోరీ సొత్తుతో విదేశీ పర్యటనలు పేదలకు దానధర్మాలు..

చోరీ సొత్తుతో విదేశీ పర్యటనలు పేదలకు దానధర్మాలు..

సినిమాలు చూసి ప్రేరణ పొందాడో ఏమో కానీ ఓ దొంగ సినిమా తరహాలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.అయితే ఈ దొంగ చాలా మంచి దొంగసుమా.చోరీలు చేసే సమయంలో ఎటువంటి హింసకు పాల్పడకుండా కేవలం తాళం వేసి ఉన్న ధనవంతుల ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకొని పని పూర్తి చేసుకువెళతాడు.అంతేకాదు దొంగతనాలు చేయడానికి బెంజ్ కారులో వచ్చి ఇళ్లు దోచి అనంతరం అదే కారులో దర్జాగా వెళ్లిపోతాడు. హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ దొంగగా ఉన్న ఇర్ఫాన్ (30) చరిత్ర ఇది. తాజాగా ఇర్ఫాన్ ముంబైలో పట్టుబడగా, అతన్ని విచారిస్తున్న హైదరాబాద్ పోలీసులు, విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు.ఢిల్లీతో పాటు హైదరాబాద్ నగరంలో ధనవంతులు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ ఇర్ఫాన్ ఆ డబ్బుతో ప్రేమాయణం సాగిస్తున్న ఢిల్లీకి చెందిన మోడల్‌తో విదేశాల్లో ఎంజాయ్ చేసేవాడు.అంతేకాదండోయ్ దొంగతనం చేసిన డబ్బులో కొంత మొత్తాన్ని బీహార్ లోని తన స్వగ్రామంలో పేద అమ్మాయిల పెళ్లిళ్లకు, వైద్య శిబిరాల నిర్వహణకు ఇర్ఫాన్ వెచ్చిస్తుండటం గమనార్హం. గతంలో ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో బెంజ్ కారు కనిపించగా, దొంగ బెంజ్ కారులో ఎందుకు వస్తాడన్న ఆలోచనతో బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అతను దొంగతనాలకు వెళ్లేటప్పుడు కూడా బెంజ్ కారులోనే వెళ్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos