ఫూంచ్: పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఖస్బా, కిర్నీ సెక్టార్లలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు పాక్ ఆర్మీ షెల్లింగ్ లు, మోర్టార్లతో కాల్పులు జరిపింది. దాడిని భారత సైనికులు తిప్పికొట్టారు. సరిహద్దుల్లో నివశిస్తున్న పౌరులను లక్ష్యంగా చేసుకొని పాక్ కాల్పులకు దిగుతోంది. ఈ నెల 13న కూడా పాక్ కథువా జిల్లా హీరానగర్ సెక్టారులో కాల్పులకు దిగింది.బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.