రానున్న రోజుల్లో తెదేపాకు షాకులపై షాకులు…

రానున్న రోజుల్లో తెదేపాకు షాకులపై షాకులు…

అధికారి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలసవెళ్లే నేతల
సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.రాజంపేటె ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితో
మొదలైన వలసల పర్వం మున్ముందు మరింత ఊపందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.మూడు
రోజుల క్రితం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరే సమయంలో  రానున్న రోజుల్లో తెదేపా నుంచి వైసీపీలోకి భారీగా
వలసలు ఉండనున్నాయంటూ వ్యాఖ్యానించారు.ఆమంచి చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తూ గురువారం
అనకాలపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ వైసీపీలో చేరారు.దీంతో ఆమంచి చేసిన వ్యాఖ్యలకు ప్రాధానత్యత
సంతరించుకుంది.రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం ముఖ్యనేతల నంచి మోస్తరు
స్థాయి నేతల వరకు మొత్తం 30 మంది నేతలు తెదేపా నుంచి వైసీపీలోకి చేరనున్నట్లు సమాచారం.ప్రస్తుతం
వినిపిస్తున్న వార్తల ప్రకారం అనంతపురం జిల్లాకు చెందిన తెదేపా నేత,మాజీ మంత్రి పల్లె
రఘునాథరెడ్డి వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.గతంలో పుట్టపర్తి నియోజకవర్గం
నుంచి పోటీ చేసి గెలుపొందిన పల్లె ఈసారి శాసనసభ ఎన్నికలపై ఆసక్తి కనబరచడం లేదు.రాజకీయ
ప్రస్థానంలో చివరి అంకానికి చేరుకోవడంతో ఎమ్మెల్యేకు బదులు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి
రాజకీయాల నుంచి వైదొలగడానికి పల్లె నిర్ణయించుకున్నారు.ఈ
మేరకు చంద్రబాబుకు కూడా
ప్రతిపాదన పంపించారట. అయితే
పల్లెకు రాజ్యసభ సభ్యత్వం పట్ల చంద్రబాబు నాయుడు
భరోసా ఇవ్వడంలేదని తెలుస్తోంది.కొద్ది
కాలం క్రితం అవమానకర రీతిలో మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు రాజ్యసభ ప్రతిపాదనను
కూడా తిరస్కరిస్తుండడంతో అసహననానికి గురైన పల్లె తెలుగుదేశంలో
ఉండి అవమానాలు ఎదుర్కొనడం కన్నా
వైదొలగడమే మంచిదని ఆయన భావిస్తున్నారట.అందులో
భాగంగా వైసీపీతో సంప్రదింపులు జరుపుతున్నారని..
తన ప్రస్తుత స్వప్నం రాజ్యసభ సీటు విషయంలో భరోసా లభిస్తే పల్లె తెలుగుదేశాన్ని వీడటం
ఖాయమని సమాచారం అందుతోంది.

ఆమంచి బాటలోనే మాగుంట..
ప్రకాశం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగలనున్నట్లు తెలుస్తోంది.చీరాల
ఎమ్మెల్యే ఆమంచి ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందు తెదేపాకు అదే జిల్లాకు చెందిన మాజీ
ఎంపీ,ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు కూడా తెదేపాను వీడడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.మాగుంట శ్రీనివాసులు తన వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.పార్టీ మారేందుకు తన అనుచర వర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఆ సమావేశం జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాగుంటకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే సీఎంతో సమావేశం కావాలని వారు సూచించినట్లు తెలుస్తోంది.మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మాగుంటకు టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. కానీ ప్రాధాన్యం లేకపోవడంతో మాగుంట టీడీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పార్టీని వీడుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ తాను ఒంగోలు ఎంపీగా పోటీచేస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో నెల్లూరులో  తన వర్గంతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి.. ప్రజల మూడ్ ను కార్యకర్తల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి మారితేనే మంచిదన్న ప్రతిపాదన వచ్చినట్లు విశ్వసనీయ సమచారం.

ఇదే బాటలో సీనియర్
నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో
చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. త్వరలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం
పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతతో నేడో, రేపో భేటీ కానున్నారు. వర్ల రత్నం…
వర్ల రామయ్యకు అన్న. అంతేకాకుండా కృష్ణా జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు. ఇలాంటి కీలక
నేత సోదరుడు, పార్టీలో కీలకంగా పని చేసిన రత్నం వైసీపీలోకి వెళ్తుండటం గమనార్హం. వర్ల
రత్నం పార్టీ మారడానికి కారణాలు ఏమిటనే చర్చ సాగుతోంది.కొద్ది రోజుల క్రితం
దగ్గుబాటి వెంకటేశ్వరరావు,కొడుకు హితేశ్‌లు వైపీలో చేరగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సమీప బంధువు తెదేపాలో చేరనున్నట్లు తెలుస్తోంది.కొందరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,
అక్కడ అవకాశం లేనిపక్షంలో మరి
కొందరు జనసేనలోకి వెళ్లే
ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
రానున్న పక్షంరోజుల్లో ఈ
వలసల వ్యవహారం సలసల మరిగే అవకాశం ఉందని అంటున్నారు. కనీసం
ముప్పైమంది నేతలు తెలుగుదేశం పార్టీకి
రాజీనామా చేసే పరిస్థితి ఉందనే
టాక్ వినిపిస్తోంది.వీరిలో
సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు,
కొన్ని నియోజకవర్గాలకు ఇన్
చార్జిలుగా ఉన్నవారు.. ఉన్నారని సమాచారం. ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ
కొన్ని నియోజకవర్గాల్లో కొత్త
అభ్యర్థులను తెరపైకి తీసుకురావాల్సి వస్తుందనే
టాక్ కూడా వినిపిస్తోంది.విశేషం
ఏమిటంటే.. వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు
కూడా తెలుగుదేశం పార్టీని
వీడే ప్రయత్నంలో ఉన్నారని
సమాచారం. ఇప్పటికే వీరు సంప్రదింపులు జరుపుతున్నారట.
అయితే వస్తే రండి.. కానీ  టికెట్ మాత్రం ఆశించొద్దు అనేది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వెర్షన్ అని తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos