తిరువనంతపురం: నైరుతి మే 31న కేరళ తీరాన్ని తాకే అవకాశ ముందని వాతావరణ శాఖ తెలిపింది. ‘మాల్దీవులు-కామొరిన్, నైరుతి, తూర్పుమధ్య బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాల్లో, ఆగ్నేయ బంగాళాఖాతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని కొన్నిప్రాంతాల్లో గురువారం ఉదయం నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు వచ్చాయి. అందువల్ల మే 31న అవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంద’ని వివరించింది. అరేబియా సముద్రం, బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇటీవల తౌక్టే తుపాను, యాస్ తుపాను ఏర్పడ్డాయి. ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1న కేరళను తాకే నైరుతి రుతు పవనాలు ఈ సారి ఒకరోజు ముందుగానే తాకుతున్నాయని పేర్కొంది.