న్యూ ఢిల్లీ: అండమాన్, నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. త్వరలోనే ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలు, నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతు పవనాలు శుక్రవారమే ప్రవేశించినట్లు వివరించింది. ఈ నెల 31న ఇవి కేరళను తాకనున్నాయని, జూన్ రెండో వారంలో రుతు పవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని లెక్క గట్టాయి.