కరోనా దెబ్బకు భారీగా నష్టపోయిన రంగాల్లో సినిమా రంగం కూడా ముందు వరుసలో ఉంటుంది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషలతో సంబంధం లేకుండా మలయాళం నుంచి హాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి.ఇక థియేటర్లు ఇప్పట్లో తెచురుకునే పరిస్థితి లేకపోవడంతో సినిమాల విడుదల పూర్తిగా ఆగిపోయింది.ఈ సమయంలో ఓటీటీలు ప్రేక్షకులను తమవైపు తిప్పుకున్నాయి.దీంతో కొన్ని చిత్రాలు ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫాంలలో విడుదల కాగా కొన్ని మధ్య,పెద్ద చిత్రాలు సైతం ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.అన్నికంటే ముఖ్యంగా ఓటీటీల్లో వస్తున్న వెబ్‌సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుండడంతో నటీనటులు సైతం వెబ్‌సిరీస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు.ఈమద్య కాలంలో లా కాసా డి పాపెల్ వెబ్ సిరీస్ ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. స్పానిష్ మరియు ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో నైరోబీ పాత్ర అందరిని ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన నైరోబీ 2013లోనే ఒక స్పానిష్ డాక్యుమెంటరీ కోసం తెలుగులో మాట్లాడినది. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ లో డాక్యుమెంటరీ షూటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో నైరోబీ పాత్ర పోషించిన అల్భా ఫ్లోరా తెలుగును చక్కగా మాట్లాడటం జరిగింది.ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు భాష ఆమె నోట రావడం చాలా గొప్పగా ఉందంటూ నెటిజన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇండియా వ్యాప్తంగా కూడా ఆ వీడియో వైరల్ అవుతోంది. జాతీయ మీడియాలో కూడా ఈ విషయం ప్రధానంగా చర్చకు వస్తుంది.