మోహిత్‌రెడ్డికి సిట్‌ నోటీసులు

మోహిత్‌రెడ్డికి సిట్‌ నోటీసులు

అమరావతి: వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి కుమారుడు మోహిత్​రెడ్డికి సిట్​ నోటీసులిచ్చింది. మద్యం కుంభకోణం కేసులో బుధవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. మద్యం కేసులో మోహిత్​రెడ్డి పేరును ఇటీవల సిట్ అధికారులు చేర్చారు. ఈ కేసులో ఆయన ఏ39గా ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి అరెస్టై ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. మద్యం ముడుపుల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని సన్నిహితుడు వెంకటేశ్‌ నాయుడు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముడుపుల సొమ్మును తొలుతగా హైదరాబాద్‌లో వెంకటేశ్‌ నాయుడు నివాసానికి చేర్చేవారు. అక్కడి నుంచి చెవిరెడ్డి బృందం దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు వరకూ ఆంధ్ర తరలించింది.మద్యం ముడుపుల సొత్తును ఎలా సేకరించారు? ఎలా రవాణా చేశారు? ఎక్కడికి చేర్చారనే అంశాలన్నీ వెంకటేశ్‌ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్​రెడ్డిలకు మాత్రమే తెలుసు. గత సంవత్సరం మే 9న గరికపాడు చెక్‌పోస్టు వద్ద లారీలో తరలిస్తూ పట్టుబడ్డ రూ.8.34 కోట్ల నగదు, లిక్కర్ ముడుపుల సొత్తేనని, లారీ పట్టుబడగానే చెవిరెడ్డి అప్పటి గన్‌మన్‌ గిరి తన ఫోన్లు స్విచాఫ్‌ చేసేశారని సిట్‌ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos