మొహర్రం ఊరేగింపులు నిషేధం

మొహర్రం ఊరేగింపులు నిషేధం

లక్నో: కోవిడ్ కారణంగా మొహర్రం ఊరేగింపులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మొహర్రం జరుపుకోవాలని విన్నవిం చింది. ఆయుధాల ప్రదర్శనకు అనుమతించబోమని డీజీపీ ముకుల్ గోయల్ సోమవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. నిరాధారమైన వార్తలు, రెచ్చగొట్టే సమాచారం రాకుండా సామాజిక మాధ్యమాలు, సంఘ వ్యతిరేక శక్తులపైన కన్నేసి ఉంచాలని పోలీసుల్ని అప్రమత్తం చేసారు. మత పెద్దలను కలిసి కోవిడ్ పరిస్థితులను వివరించి ఇంట్లోనే ముహర్రం జరుపుకోవాల్సిన అవసరాన్ని తెలియజేయాలనీ అధికారులను కోరారు. మొహర్రం కార్యక్రమాలను శాంతి సమితి సమావేశంలో నిర్ణయిస్తామని తెలి పారు. ప్రతి జిల్లాలోనూ, ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో తగిన సంఖ్యలో బలగాలను మోహరిస్తున్నామని వివరించారు. దీన్ని షియా మత పెద్దలు ఆక్షేపించారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల్లో అభ్యంతరకరమైన భాష వాడినట్టు తప్పుబట్టారు. శాంతిని ఇష్టపడే షియాలను కించపరచేలా ఆ భాష ఉందని షియా మతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మార్గదర్శకాలను ఉపసంహరించుకోని పక్షంలో శాంతి కమిటీ సమావేశాలను ఉలామాలు, సంస్థలు బహిష్కరించాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos