కర్నూలు: మొహర్రంలో అపశృతి సంభవించింది. బి.తాండ్రపాడు పీర్ల చావిడి దగ్గర పిట్ట గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో 20 మందికి పైగా గాయపడ్డారు. పలువురి పరిస్ధితి విషమంగా ఉంది. ఎప్పటిలాగే నిప్పుల గుండాన్ని ముస్లిం సోదరులు తోక్కారు. దాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో జనం పక్కనే ఉన్న ఇంటి మేడ పిట్ట గోడపై కూర్చున్నారు. అది కూలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షత గాత్రులను హుటా హుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల త్యాగాల జ్ఞాపకార్ధం ముస్లిం సోదరులు మొహర్రం జరుపుకుంటారు. ముస్లిం పంచాంగంలో మొదటి నెల మొహరం. యుద్ధంలో మరణించిన వీరులకు ప్రతీకగా చేయి రూపాలను ఊరేగిస్తారు వీటినే పీర్లు అని పిలుస్తారు.