హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సినీ నటుడు మోహన్ బాబుకు ఊరటనిచ్చింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు తొలుత ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు మంజూరు చేసింది. నెల రోజుల్లోగా వైవీఎస్. చౌదరికి ఇవ్వాల్సిన రూ.48 లక్షలు చెల్లిస్తే కేసు కొట్టి వేస్తామని కూడా తెలిపింది.