మోహన్ బాబు, గృహ నిర్బంధం

తిరుపతి: సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్‌ బాబును పోలీసులు శుక్రవారం ఆయన గృహంలోనే నిర్భందించారు. ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండు చేస్తూ శుక్రవారం ఉదయం విద్యా సంస్థ ఎదుట తిరుపతి-మదనపల్లి రోడ్డుపై మోహన్‌ బాబు, ఆయన తనయుడు సినీ నటుడు మంచు మనోజ్ , విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. బకాయిల చెల్లింపునకు గత నాలుగు న్నర ఏళ్లుగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ వ్యర్థ మయ్యాయని దుయ్యబట్టారు. తమ సంస్థకు రూ.తొమ్మి కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని ఆరోపిం చారు. ఇదే విషయంపై పలు పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా చొరవ చూపలేదన్నారు. దరిమిలా పది వేల మంది విద్యార్థులతో కళాశాల నుంచి తిరుపతి వరకు భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు చంద్రబాబు కష్టంలో ఉన్నపుడు తాను, తమ విద్యార్థులు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రజల నుంచి దోచుకొన్న సొమ్మునే వాగ్ధానాల రూపంలో తిరిగి చెల్లిస్తున్నారని దుయ్యబట్టారు. ‘గత నాలుగు న్నర ఏళ్లుగా బాబుకు మహిళలు గుర్తుకు రాలేదు. ఇప్పుడేమో మహిళలకు పసుపు కుంకుమ పేరుతో తాయిలాలు ఇస్తున్నార’ని విమర్శించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున నిరసన ప్రదర్శనకు అనుమతి వ్వలేమని పోలీసులు తెలిపారు. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా మోహన్‌ బాబు ఆందోళనకు దిగినందుకు పోలీసులు అనివార్యంగా ఆయన్ను గృహ నిర్బంధం చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos