న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభ బరిలోకి దిగనున్నారు. ఈ నెల 13న నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ శైనీ గత జూన్ 24న మరణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్య మైంది. మన్మోహన్ సింగ్ ఇక్కడ నుంచి ఎన్నికైతే 2024 ఏప్రిల్ 3 వరకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతారు. గత మూడు దశాబ్దాలుగా మన్మో హన్ అసోం నుంచే 1991 నుంచి 2019 జూన్ 14 వరకు వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2004 నుంచి 2014 వరకు ప్రధాన మంత్రిగా ఉన్నారు. అసోంలో కాంగ్రెస్కు తగినంత బలం లేకపోవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లేనని అందరూ భావించారు. అనూహ్యంగా రాజ స్థాన్లో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఆగస్టు 7న నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మరోసారి మన్మో హన్ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ నెల 26న ఉప ఎన్నిక జరగనుంది. అదే రోజున ఫలితం వెల్లడవుతుంది.